వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు రోజురోజుకు వైభవాన్ని కోల్పోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఐసీసీ టోర్నీ జరిగినప్పుడల్లా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉండేది పాకిస్తాన్ జట్టు. కానీ ఇప్పుడు ఇక టైటిల్ ఫేవరెట్ కాదు. కనీసం వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ కి అయిన పోటీ ఇవ్వగలదా అనే అనుమానం అందరికీ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన టి20 నుంచి ఆ జట్టు ఆట తీరు దారుణంగా మారిపోయింది. చిన్నచిన్న టీమ్స్ చేతుల్లో సైతం దారుణమైన ఓటములను చవిచూస్తూ పాకిస్తాన్ జట్టు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది అని చెప్పాలి.


 అంతేకాకుండా గత కొంత కాలం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ దగ్గర నుంచి కోచింగ్ సిబ్బంది ఇక ఆ జట్టు కెప్టెన్స్ వరకు అన్ని విషయాలలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మార్పులు జట్టు వైఫల్యానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదు అన్న విషయం తరచూ బయటపడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పులు రావలసిన అవసరం ఉందని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇలాంటి సమయం లో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్గా తనకు అవకాశం వచ్చిందని.. కానీ తానే రిజెక్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ మాజీ ఆల్ రౌండర్. ప్రస్తుతం తాను ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడుతున్నానని ఇలాంటి పరిస్థితుల్లో తనతో కలిసి ఆడుతున్న ఆటగాళ్ళను తాను ఎలా సెలెక్ట్ చేయగలను అంటూ అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ తరపున ఆడటం పై ఎలాంటి ఆసక్తి లేదని.. కానీ దేశవాళి టీ20 లలో మాత్రం కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: