అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత అత్యుత్తమ ప్రస్తానాన్ని కొనసాగించాలని ప్రతి ఆటగాడు కూడా ఆశ పడుతూ ఉంటాడు అని చెప్పాలి. మూడు ఫార్మాట్లలో కూడా అదరగొడుతూ ఇక వరల్డ్ క్రికెట్లో లెజెండరి ప్లేయర్గా ఎదగాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇలా విజయవంతమైన ప్రస్థానం కొనసాగించడం అందరి ఆటగాళ్ల వల్ల కాదు. కేవలం కొంతమంది మాత్రమే పట్టుదలతో అనుకున్నది సాధించి లెజెండ్స్ గా ఎదుగుతూ ఉంటారు.


 ఇక అలాంటి ఆటగాళ్ల పేర్లు అటు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో అరుదైన రికార్డులు సాధించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకొంత మంది క్రికెటర్లు ఇలాంటి రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు  ఈ క్రమంలోనే ఆయా రికార్డుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆటగాడు సెంచరీ చేయడం అంటే ఒక స్పెషల్ మూమెంట్.


 ప్రతి మ్యాచ్ లోను సెంచరీ చేయాలని ఉద్దేశం తోనే బరిలోకి దిగినప్పటికీ.. కేవలం కొన్నిసార్లు మాత్రమే అది సాధ్యం అవుతూ ఉంటుంది. అలాంటిది అత్యంత వేగంగా 50 సెంచరీలు పూర్తి చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగం గా 50 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ హసీమ్ ఆమ్లా తొలి స్థానం లో ఉన్నారు. 348 ఇన్నింగ్స్ లలో ఈ ఇద్దరు 50 సెంచరీలు నమోదు చేశారు. ఈ లిస్టు లో వీరి తర్వాత వరుసగా సచిన్ 376, రికీ పాంటింగ్ 418, జో రూట్ 455, బ్రియాన్ లారా  465, కలీస్ 520, సంగాక్కర 593, జయవర్ధనే 667 ఇన్నింగ్స్ లలో ఇలా 50 సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: