యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, ఎంఎస్ ధోని మధ్య పంచాయితీ జరుగుతోంది. టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఎంఎస్ ధోనిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆరోపణలు చేసిన యోగరాజ్ సింగ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లోనే తెగ హాట్ టాపిక్ అవుతోంది.


తన కుమారుడి అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ను ధోని సర్వనాశనం చేశాడంటూ యోగరాజ్ సింగ్ ఓ వీడియోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో యువి తన తండ్రి గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో మా నాన్నగారు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని యువరాజ్ చెప్పడం జరిగింది.


టీమ్ ఇండియా వరల్డ్ కప్ హీరోగా కెరీర్ ముగించుకున్న యువరాజ్ గత ఏడాది ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ....మా నాన్న యోగరాజ్ సింగ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆయన అసలు ఒప్పుకోడని యువరాజ్ ఓ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసిన వారంతా అవునా అందుకనే ధోనిపై యోగరాజ్ అలాంటి ఆరోపణలు చేశాడా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.... ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.



43 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతారా లేదా అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అతనిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రంగంలోకి దింపడానికి బీసీసీఐని ఒప్పించడానికి సీఎస్కే విపరీతంగా ప్రయత్నాలు చేస్తుందని మీడియా వెల్లడించింది. ఇక అటు 2011 వరల్డ్ కప్ సమయంలో లంగ్ క్యాన్సర్ తో యూవీ బాధపడ్డాడు. క్యాన్సర్ ఉందని పక్కకు తప్పుకోకుండా వరల్డ్ కప్ లో తన ఆట తీరును ప్రదర్శించాడు. ఆ మెగాటోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా యువీకి ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: