పాకిస్తాన్ క్రికెట్ టీం అంటే ఒకప్పుడు వరల్డ్ ఛాంపియన్గా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ జట్టు ఆట తీరు చూస్తూ ఉంటే సగటు క్రికెట్ ప్రేక్షకుడు జాలి పడుతున్నాడు అని చెప్పాలి. అంతలా ఆ జట్టు ఆట తీరు దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు అగ్రశ్రేణి టీంగా కొనసాగుతూ పెద్ద పెద్ద టీమ్స్ కి గట్టి పోటీ ఇచ్చిన పాకిస్తాన్ ఇక ఇప్పుడు పసికూన జట్ల చేతుల్లో సైతం దారుణంగా ఓడిపోతుంది అని చెప్పాలి. దీంతో ఇక పాకిస్తాన్ జట్టు అటు వరల్డ్ క్రికెట్లో పూర్వవైభవాన్ని కోల్పోతుంది అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు.


 అయితే ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో ఏకంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి దారుణంగా విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్కు ఇటీవల మరో ఘోర పరాజయమ్ ఎదురైంది. ఏకంగా బంగ్లాదేశ్ జట్టు చేతుల్లో ఓడిపోయింది. అది కూడా వారి సొంత గడ్డమీద బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండగా.. ఇక ఇటీవల రెండో టెస్ట్ మ్యాచ్ లోను బంగ్లాదేశ్ ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు చరిత్రలో ఎన్నడూ లేని ఒక దారుణమైన ఓటమిని చవిచూసింది పాకిస్తాన్ జట్టు.


 ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు మరో దేశంలో ఆడి తొలిసారిగా ఆ జట్టును టెస్టుల్లో వైట్ వాష్ చేసేసింది. ఇక రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు పాకిస్తాన్ కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో  185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. దీంతో అప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్లో ఘనవిజయాన్ని సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ను ఓడించి ఇక సిరీస్ ను వైట్ వాష్ చేసేసింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇరు జట్ల స్కోరు చూసుకుంటే.. పాకిస్తాన్ 274 & 179.. బంగ్లా 262&185పరుగులు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: