రాహుల్ ద్రవిడ్.. ఈ పేరు గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగానే భారత జట్టు తరుపున క్రికెటర్ గా కొనసాగిన ఈయన.. ఇక తనదైన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాదు టీమ్ ఇండియాకు స్ట్రాంగ్ వాల్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అందరూ క్రికెటర్లు విధ్వంసకరమైన ఆట తీరుతో ఫేమస్ అవుతూ ఉంటారు. కానీ రాహుల్ ద్రావిడు మాత్రం నెమ్మదైన ఆట తీరుకూ కేరాఫ్ అడ్రస్ గా మారి ఇక అందరి ప్రేమాభిమానాలను గెలుచుకోగలిగాడు.



 అయితే కేవలం టీం ఇండియాలో స్టార్ ప్లేయర్ గా మాత్రమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా సేవలు అందించాడు రాహుల్ ద్రవిడ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతూ ఇక కొత్త ప్రతిభను అటు భారత క్రికెట్కు పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇక అతని నేతృత్వంలో భారత జట్టు ఏకంగా టి20 వరల్డ్ కప్ కూడా గెలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హెడ్ కోచ్ పదవీ కాలం ముగియడంతో ఇక కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు రాహుల్ ద్రావిడ్.



 ఈ క్రమంలోనే రాహుల్ ద్రావిడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఐపీఎల్ లో ఏదో ఒక జట్టుకి హెడ్ కోచ్ అవతారం ఎత్తే అవకాశం ఉంది అని వార్తలు కూడా వచ్చాయ్. ఇక ఇప్పుడు అనుకున్నదే జరిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ నియమితుడు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ద్రావిడ్ ఫ్రాంచైజీ మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. అలాగే ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ గా కుమార సంగంకర, అసిస్టెంట్ కోచ్గా విక్రం రాథోడ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే 2012, 13 సీజన్లకి రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ కెప్టెన్గా కొనసాగారు. ఇక 14, 15 సీజన్లకి మెంటార్గా వ్యవహరించారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: