ప్రపంచ శ్రేణి బౌలర్లు బ్యాట్స్మెన్లు జట్టులో ఉన్నప్పటికీ ఎందుకో ఆ జట్టు ఆట తీరు మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉంది. ఇక జట్టులోని ఆటగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడమే.. ఇలా టీం వైఫల్యానికి కారణం అన్నది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటన ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్ చేతిలోనూ దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కి గాను బంగ్లాదేశ్ పాకిస్తాన్ పర్యటనకు రాగా.. చిన్న టీం బంగ్లా చేతిలో పాకిస్తాన్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయి క్లీన్ స్వీప్ అయింది.
క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక దేశ పర్యటనకు వెళ్లి ఆ దేశాన్ని టెస్టుల్లో ఓడించి బంగ్లాదేశ్ మొదటి సారి క్లీన్స్వీప్ చేసింది. అయితే ఇప్పటికే ఇలా వైట్ వాష్ అయ్యి ఎదురు దెబ్బ తిన్న పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరడం కష్టంగానే మారింది. బంగ్లా పై పేలవ ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిదవ స్థానానికి దిగజారింది. జరగబోయే టెస్టుల్లో విజయం సాధించిన టాప్ 2 లోకి చేరడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నట్లే అంటూ అభిప్రాయపడుతున్నారు.