తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఎంతల బీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా భారీ వర్షాలు నేపథ్యంలో నదులన్నీ కూడా నిండిపోయి జనవాసాల్లోకి వరదలు వచ్చేసాయి. దీంతో ఇక ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి  వెళ్లిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ వరదల్లో చిక్కుకొని ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా భారీ భావనాలు సైతం నీట మునిగిపోవడంతో ఇక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ప్రజలు. ఎటు వెళ్లలేని స్థితిలో కనీసం ఎవరైనా ఆహారం దానం చేస్తారేమో అని దీనంగా ఎదురుచూసిన పరిస్థితి కనిపించింది.


 అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుతూ ఉన్న నేపథ్యంలో ఇలా వరద నీటిలో మునిగిపోయిన ప్రాంతాలన్నీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇంకోవైపు అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతూ ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేసేందుకు ఎంతో మంది సిని రాజకీయ ప్రముఖులు ఇక విరాళాలను కూడా ప్రకటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీ అయిన ఎయిర్టెల్ తమ యూజర్లందరికీ కూడా ఒక ఆఫర్ ప్రకటించింది.


 ప్రస్తుతం భారీ వరదలు నేపథ్యంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరైనా రీఛార్జ్ అయిపోతే కనీసం రీచార్జ్ చేయలేని దుస్థితి. అయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఎయిర్ టెల్ కంపెనీ వరదల నేపథంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా రీఛార్జ్ చేసుకుని ప్రీపెయిడ్ యూసర్లకు అదనంగా నాలుగు రోజులపాటు కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. అదే సమయంలో రోజుకి 1.5 జిబి ఉచిత డాటాను అందిస్తుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు బిల్లు చెల్లింపు గడువు మరో వారం రోజులపాటు ఇచ్చింది. అంతేకాదు ఇళ్లపై ఉండే వైఫై కనెక్షన్ల గడువుని కూడా మరో నాలుగు రోజులు పెంచింది ఎయిర్టెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: