టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు అందరూ కూడా వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లుగా హవా నడిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల నుంచి ఇలా భారత క్రికెట్లో రాణిస్తున్న ప్లేయర్లు అందరూ ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అన్ని రకాల బౌలింగ్లు ఆడటంలో భారత ఆటగాళ్లు దిట్ట అని చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. మరి ముఖ్యంగా ఇతర దేశాల క్రికెటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో ఎప్పుడు తడబడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 కానీ భారత క్రికెటర్లు మాత్రం స్పిన్ బౌలింగ్ ఆడటంలో దిట్ట అని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎంతోమంది భారత స్టార్ ప్లేయర్ల ఆట తీరు చూస్తూ ఉంటే ఇక స్పిన్ బౌలింగ్ ఉచ్చులో తరచూ చిక్కుకుంటూనే ఉన్నారు. ఒకప్పుడు ఎలాంటి స్పిన్నర్ అయిన సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ బాటర్లు ఇక ఇప్పుడు మాత్రం ఎవరైనా స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు తడబాటుకు గురవడం చూస్తూ ఉన్నాం. ఇంకొంతమంది అయితే ఏకంగా వికెట్ సైతం సమర్పించుకుంటూ ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు ఏకంగా దశాబ్ద కాలం నుంచి వరల్డ్ క్రికెట్లో  హవా నడిపిస్తున్న క్రికెటర్ల సైతం ఇలా స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడుతూ ఉండడం భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది.


 అయితే ఇండియన్ క్రికెటర్లు ఇలా స్పిన్ బౌలింగ్ ఉచ్చులో చిక్కుకొని విలవిలడటంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇలా జరగడానికి గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మేము ఎంత బిజీగా ఉన్నా.. దేశవాళి టోర్నీలు మిస్ అయ్యే వాళ్ళం కాదు. కానీ నేడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్లేయర్లు డొమెస్టిక్ క్రికెట్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. టి20 కారణంగా నాణ్యమైన స్పిన్నర్లు కూడా కరువయ్యారు. ఇక దీని కారణంగానే భారత క్రికెటర్లకు స్పిన్ బౌలింగ్ నుండి సరైన ప్రాక్టీస్ లభించడం లేదు. అందుకే ఇలా జరుగుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: