అయితే క్రికెటర్లకు సంబంధించి కేవలం ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు కూడా అటు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతుంటాయి. ఎవరైనా క్రికెటర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు అంటే అలాంటి విషయాలు ఇంటర్నెట్లో ఫైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఎంతోమంది భారత సంతతి క్రికెటర్లు విదేశీ జట్ల తరఫున ఆడుతూ అదరగొడుతున్నారు. దీంతో వారి గురించి తెలుసుకునేందుకు.. భారత క్రికెటర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా భారత సంతతికి చెందిన ఒక క్రికెటర్ గురించి షాకింగ్ విషయం ఇప్పుడు భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది.
భారత మూలాలు ఉన్న ఐర్లాండ్ క్రికెటర్ సిమిసింగ్ ప్రాణపరిస్థితిలో ఉన్నారట. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. కాలేయం పూర్తిగా దెబ్బ తినడంతో గురుగ్రామ్ లోనే ఒక ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే సిమీ సింగ్ భార్య అగం దీప్ కౌర్ తన కాలేయంలోనే కొంత భాగాన్ని ఇక భర్త కోసం దానం చేశారట. కాగా సిమీ సింగ్ ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 t20 మ్యాచ్ లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 83 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా రెండు సెంచరీలు బాది వార్తల్లోకి ఎక్కాడు. ఇక ఇప్పుడు అతను ప్రాణాపాస్థితిలో ఉన్నాడని తెలియడంతో.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ అందరు కూడా ఆకాంక్షిస్తున్నారు.