ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం క్రికెట్లో ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇక ప్రతి విషయంలో కూడా అంపైర్లు కచ్చితంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ప్రేక్షకులకు మరింత నాణ్యమైన క్రికెట్ ను అందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ని తీసుకువస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇక క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అప్పీల్ చేయడం.. అంపైర్గా ఉన్న వ్యక్తి ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం చేస్తూ ఉంటారు. అయితే ఎంపైర్ నిర్ణయం పై అనుమానాలు ఉంటే వెంటనే రివ్యూ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి డిఆర్ఎస్ సిస్టం కారణంగా క్రికెట్ మ్యాచ్ లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా.. ఇక నాణ్యమైన క్రికెట్ ని ఆడగలుగుతున్నారు ప్లేయర్లు. అయితే ఇండియన్ క్రికెట్లో అటు దేశవాళీలలో మాత్రం ఇలాంటి డిఆర్ఎస్ సిస్టం అందుబాటులో లేదు.


 కానీ ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ లో మాత్రం బీసీసీఐ డిఆర్ఎస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఇదే విషయంపై స్పందించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐ నిర్ణయం పై ప్రశంసలు కురిపించాడు. దీనివల్ల దేశవాళీ క్రికెట్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్ల సైతం తమ తప్పుల్ని తెలుసుకొని తమను తాము మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. రికీ బుయ్ ఇటీవలే అవుట్ అయిన విధానాన్ని అశ్విన్ ఉదాహరణగా చూపాడు. కాగా టీమిండియా తరఫున ప్రాతినిధ్య వహించిన ఎంతోమంది క్రికెటర్లు ఇక ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడుతూ అదరగొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: