టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి కేవలం ఇండియన్ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే కాదు. వరల్డ్ క్రికెట్ లవర్స్ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అతను టీమిండియా కెప్టెన్ గా అవ్వకముందే ఆటగాడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లలో అతను మొదటి వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ శర్మను అతని అభిమానులు అందరూ కూడా హిట్ మాన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారూ.


 అయితే అతను బ్యాట్ పట్టుకొని మైదానం లోకి బరిలోకి దిగిన ప్రతీసారి కూడా అభిమానులు తనకు ఇచ్చిన బిరుదును సార్ధకం చేసే లాగానే ఆట తీరును కొనసాగిస్తూ ఉంటాడు. ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఇక రోహిత్ లోని కెప్టెన్సీ నైపుణ్యం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ ఇక కెప్టెన్సీ చేపట్టిన అతి తక్కువ సమయంలోనే అటు భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ కూడా అందించి 140 కోట్ల భారత ప్రజల కలను సహకారం చేశాడు అని చెప్పాలి.


 అయితే ఇలా స్టార్ క్రికెటర్ గా కొనసాగినప్పటికీ జూనియర్ క్రికెటర్లతో సైతం సరదాగా జోకులు వేస్తూ కనిపిస్తూ ఉంటాడు రోహిత్. అయితే కెప్టెన్ రోహిత్ గురించి మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో దక్కన్ చార్జెస్ కు రోహిత్తో కలిసి ఆడిన సమయంలోనే అతనిలోని గొప్పతనాన్ని గుర్తించినట్లు స్టైరిష్ చెప్పుకొచ్చాడు. 2008 ఐపీఎల్ తొలిసారిగా రోహిత్ తో కలిసి ఆడాను. అప్పటికి అతనికి 19 ఏళ్లు ఉంటాయేమో. కానీ సాధారణ ఆటగాడు కాదని గుర్తించ. అద్భుతంగా ఆడేవాడు. ఈమధ్య ఒక సిరీస్ సందర్భంగా మరోసారి రోహిత్ ని కలిసాను. అయితే అతనిలో ఎలాంటి మార్పు కనిపించలేదు అంటూ స్కాట్  స్టైరిష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: