సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతీ క్రికెటర్ కూడా ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని ఆశపడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో కూడా మెరుగ్గా రాణించేందుకు ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. ఒకవైపు గాయాల బారిన పడి కెరియర్ ని నాశనం చేసుకోకుండా ఫిట్నెస్ను కాపాడుకుంటూనే.. ఇక అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటారు అందరూ ఆటగాళ్లు.


 ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని అరుదైన రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. కొంతమంది ఆటగాళ్ళు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డులను నమోదు చేసి.. ఇక వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సాదరణంగా ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ నమోదు చేయడం అనేది ప్రతి ఆటగాడికి ఎంతో స్పెషల్. ఇలా సెంచరీ నమోదు చేసిన సమయంలో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్భై పోతు ఉంటారు క్రికెటర్లు. ఈ క్రమంలోనే తమకు నచ్చినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా మూడు ఫార్మర్లలో సెంచరీలు చేసే ప్లేయర్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.


 ఇక టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేయడం అంటే చాలా కష్టం. ఒకవేళ చేసిన ఏదో ఒక జట్టుపై తరచూ సెంచరీ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని ఒక సరికొత్త రికార్డు నమోదయింది. క్రికెట్ చరిత్రలో తొలి ఏడూ టెస్ట్ సెంచరీలను ఏడు వేరు వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ప్లేయర్ ఓలి ఫోప్  నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ రికార్డు సాధించారు. పోప్ కి ఇది 49వ టెస్ట్ కాగా.. ఇప్పటివరకు ఏడు సెంచరీలు బాదాడు. వీటిని 6 మైదానాల్లో చేయడం గమనార్హం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, పాకిస్తాన్ జట్లపై ఆయన శతకాలు బాదాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: