ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగనుంది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరగబోతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టోర్నమెంట్ ప్రతిపాదిత షెడ్యూల్ ను ఐసీసీకి సమర్పించడం జరిగింది. టోర్నమెంట్ మూడు స్టేడియంలో జరుగుతుందని పీసీబీ అనౌన్స్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీని కరాచీ, రావల్పిండి, లాహోర్ లలో నిర్వహించనున్నారు.


అయితే చాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లొద్దంటూ భారత క్రికెట్ బోర్డు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ కు సంబంధించి మళ్లీ వివాదాలు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లకపోతే ఐసీసీ పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శ్రీలంక క్రికెట్ జట్టుకు లాభం చేకూరుతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.


ఎన్నో అగ్రదేశాలు అలాగే చిన్న దేశాలు పాకిస్థాన్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే భారత్ మాత్రం ఇక్కడికి రావడానికి అసలు రాజీపడడం లేదు ఎందుకని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా సంచలన వాక్యాలు చేశారు. చర్చలు బాంబులు ఒకేసారి జరగబోవు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్తాన్ తో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా లేము. అది సరైన సమయం కాదు. కానీ కాశ్మీర్ యువతతో కచ్చితంగా మేము మాట్లాడతామని పేర్కొన్నారు.


పాకిస్తాన్ తో చర్చలు, ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు డిమాండ్ చేస్తున్నాయని మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. చూస్తుంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్తాన్ కు వెళ్లడానికి సిద్ధంగా లేదని అమిత్ షా తన మాటల రూపంలో తెలియజేసినట్లు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: