క్రికెట్ అనేది పాశ్చాత్య దేశాల ఆట. కానీ అదే క్రికెట్ కి ఇండియాలో ఏ రేంజ్ లో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రపంచ దేశాలలో ఏ కంట్రీలో లేని విధంగా ఇండియాలో క్రికెట్ ని అమితంగా ఆదరిస్తూ అభిమానిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇండియాలో క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజీ ఉంది కాబట్టి భారత క్రికెట్ బోర్డుకు భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆదాయంతోనే ప్రస్తుతం బీసీసీఐ వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా హవా నడిపించగలుగుతూ ఉంది. ఒక రకంగా ఐసీసీకి భారీగా విరాళాలు ఇచ్చేది కూడా అటు భారత క్రికెట్ బోర్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇక బిసిసిఐ ఏది చెప్తే.. ఐసీసీ కూడా అదే ఫాలో అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రారంభించిన ఐపిఎల్ కారణంగా అటు భారత క్రికెట్ బోర్డు కు వచ్చే ఆదాయం రెట్టింపు అయింది.



 ఇలా అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ బోర్డు అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి నైపుణ్యం వెలుగులోకి రావడమే ఇలా భారత క్రికెట్ శక్తివంతమైన స్థాయికి చేరుకోవడానికి కారణం అంటూ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మా కాలంలో కేవలం ప్రధాన నగరాల నుంచి మాత్రమే మంచి క్రికెటర్లు తెరమిదికి వచ్చేవారు. అయితే మారుమూల ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్లు ఉన్నప్పటికీ వాళ్ళు తెరమీదకి వచ్చేందుకు మార్గం ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో దేశవాలి క్రికెట్ అత్యంత బలంగా మారిపోయింది అంటూ రాహుల్ ద్రవిడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: