నేటి రోజుల్లో క్రికెట్లో ఎంత అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అంపైర్లు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఇక ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్లలో ఎలాంటి తప్పిదాలు చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటున్నారు అని చెప్పాలి. టెక్నాలజీ ఆధారంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.


 అయితే ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు తప్పనిసరిగా ఎంపైర్లు ఉండాల్సిందే. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ లోని ప్రతిఘటనను క్షుణ్ణంగా పరిశీలించి అది తప్ప ఒప్ప అని తేల్చి నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఇలా అంపైర్ ఎంతో అవసరం. కానీ అంపైర్ లేకుండా మ్యాచ్ జరగడం ఎప్పుడైనా చూసారా. ఊరుకోండి బాసు గల్లి క్రికెట్ లో ఇలా జరుగుతుంది. కానీ ప్రొఫెషనల్ క్రికెట్లో అంపైర్ లేకుండా మ్యాచ్ జరగడం ఏంటి.. మేమైతే అలాంటి మ్యాచ్ ని ఇప్పటివరకు చూడలేదు అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం అలాగే జరిగింది ఏకంగా ఎంపైర్ లేకుండానే మ్యాచ్ జరగడం కాదు సిరీస్ కూడా ముగిసింది.


 ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య ఇటీవల టి20 సిరీస్ ముగిసింది. అది కూడా అంపైర్ లేకుండానే అయితే ఈ సిరీస్ లో అటు ఫీల్డ్ అంపైర్లు ఉన్నప్పటికీ థర్డ్ ఎంపైర్ మాత్రం లేడు. ఇలా థర్డ్ అంపైర్ లేకపోవడంతో డిఆర్ఎస్, రన్ అవుట్, స్టంట్ అవుట్ ను ఫీల్డ్ ఎంపైర్లే ప్రకటించారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా బ్యాటర్ మేగ్ గుర్క్ చాలా కలిసి వచ్చింది. రెండు టీ20 లో అతడు స్టంప్ అవుట్ అయినప్పటికీ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. రిప్లై లో అవుట్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీం ఆస్ట్రేలియా ఆడుతున్న థర్డ్ ఎంపైర్ లేకపోవడం తీవ్ర చర్చనీయంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: