టీం ఇండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ఫేమస్ అయ్యారు. ఎన్నో విజయాలను సాధించిన గిల్ క్రికెట్ మైదానంలోనే కాకుండా బయట కూడా కొంతమందితో ప్రేమ వ్యవహారాల కారణంగా మరింత ఫేమస్ అయ్యాడు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లతో గిల్ ప్రేమాయణం నడుపుతున్నాడంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల టీవీ నటి రిద్దిమ పండిట్ తో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది.


ముఖ్యంగా గిల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో ప్రేమాయణం  రోజులపాటు సాగిందని, అంతేకాకుండా వీరిద్దరూ బయట రెస్టారెంట్లలో భోజనం చేస్తూ కెమెరా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత వారు విడిపోయారని అనంతరం స్పెయిన్ దేశానికి చెందిన మారియో అరోయోగ్ తో గిల్ కొన్ని రోజులు రిలేషన్ కొనసాగించాడని నేషనల్ మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి.


అనంతరం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ తో కూడా ప్రేమాయణం నడిపించాడంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. 2020లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సారా టెండూల్కర్, గిల్ గురించి ప్రశంసించడంతో వారీ ప్రేమ అనేక రకాల వార్తలకు దారితీసింది. అంతేకాకుండా వీరిద్దరూ బయట కలుసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలకు మరొకరు లైక్స్ చేయడం, ఏదో ఒక కామెంట్ చేయడం వంటివి జరిగాయి. దీంతో వీరు లవ్ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఈ మధ్యకాలంలో వీరిద్దరి గురించి ఎలాంటి వార్తలు వినిపించడం లేదు.


అయితే వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని, ఇన్స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడం వంటి అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఈ విషయం తెలిసి గిల్ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఇదిలా ఉండగా... ప్రస్తుతం గిల్... బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్ కౌర్ అనే అమ్మాయితో బర్త్డే జరుపుకున్నాడు. అంతేకాకుండా నైట్ పార్టీలు, బయట కలుసుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. దీంతో అవ్‌నీత్ కౌర్ తో గిల్ నైట్ అంతా పార్టీలో ఎంజాయ్ చేశాడని, వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందేమోనంటూ అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవంగా తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: