టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇటీవల భారత జట్టుకు హెడ్ కోచ్గా పదవి బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనదైన శైలిలో ఇక జట్టులో ఎన్నో మార్పులు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. జట్టులో ఎక్కువమంది ఆల్ రౌండర్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక అందరు ప్లేయర్లతో బౌలింగ్ వేయిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే గౌతమ్ గంభీర్ ఇలా భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐపీఎల్ టీమ్ అయిన కోల్కతాకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో కోల్కత్తా మెంటర్గా వ్యవహరించారు గౌతమ్ గంభీర్.


 సూపర్ సక్సెస్ అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇలా మెంటర్ గా జట్టును తన వ్యూహాలతో ముందుకు నడిపించి ఏకంగా ఐపీఎల్ టైటిల్ అందించడంలోనూ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఇక గౌతమ్ గంభీర్ అటు టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఇక గంభీర్ స్తానంలో కోల్కతా జట్టు మెంటార్గా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పలువురు మాజీ ఆటగాళ్ల పేర్లు కూడా తెరమీదకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు కోల్కతా మెంటార్గా రాబోయే వారి పేరులో ఇప్పుడు కొత్త పేరు వచ్చి చేరిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ మెంటల్గా సౌత్ ఆఫ్రికా దిగ్గజాం  కలీస్ ను నియమించాలని కోల్కతా ఫ్రాంచైజీ నిర్ణయించిందట. అతడితో పాటు కుమార సంగకర రిక్కీ పాంటింగ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోల్కతా జట్టుతో కలిస్ కు మంచి అనుబంధం ఉంది. గంభీర్ కెప్టెన్గా ఉన్న సమయంలో కోల్కతా జట్టు తరఫున కలిస్ ఆడాడు. అంతేకాదు ఆ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు. అందుకే అతడినే మెంటార్గా నియమించుకునేందుకు ఫ్రాంచైజీ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: