బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి అటు వరల్డ్ క్రికెట్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో స్టార్లుగా పేరు సంపాదించుకున్న వారు మాత్రమే కాకుండా ఎంతో మంది యువ ఆటగాళ్ల పాలిట ఐపీఎల్ అనేది ఒక వరంలా మారిపోయింది  అప్పటివరకు దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లు తమ ప్రతిభ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేసేందుకు ఐపీఎల్ ఒక మంచి వేదికగా కొనసాగుతుంది. ఐపిఎల్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతూ ఆకట్టుకుంటూ ఉంటారు.


 అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ప్లేయర్లకి ఆ తర్వాత సీజన్లో మంచి డిమాండ్ ఏర్పడటం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఆయా ఆటగాళ్ల ప్రతిభను చూసి ఇక ముందు సీజన్లో బాగా రాణించకపోయిన కొన్ని కొన్ని సార్లు కొన్ని ఫ్రాంచైజీలు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. 2024 ఐపీఎల్ సీజన్లో యష్ దయాలకి ఆర్సిబి జట్టు ఇలాగే ఛాన్స్ కల్పించింది. గత ఏడాది సీజన్లో దారుణంగా విఫలమైన అతనికి ఛాన్స్ కల్పించగా.. అతను అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.



 అయితే 2023 ఐపిఎల్ సీజన్లో ఏకంగా రింకు సింగ్ బ్యాటింగ్ విధ్వంసానికి యష్ దయాల్ బలయ్యాడు. తీవ్రమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నాడు.  ఇలా 2023 ఐపీఎల్ లో విఫలమై ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో అదరగొట్టడం గురించి ఇటీవల స్పందించాడు ఈ యంగ్ ప్లేయర్. కోహ్లీ తనకు ఇచ్చిన ధైర్యమే ఇలా బాగా రాణించడానికి కారణం అంటూ యష్ దయాల్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడటానికి ముందు విరాట్ కోహ్లీ నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. నన్ను రూమ్ కి పిలిచి నువ్వు ఎలా ఆడిన ఏం పర్వాలేదు. ఈ సీజన్ అంతా నువ్వు జట్టులో ఉంటావు. ఎప్పుడు ఆర్సిబికి ఆడిన నీ మొహం పై నవ్వు ఉండాలి అని అన్నాడు. ఇక కోహ్లీ చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని నింపాయి అంటూ యష్ దయాల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: