సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే t20 ఫార్మాట్ అంటూ మూడు ఫార్మాట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు ఫార్మాట్లలో  అతి కష్టమైన ఫార్మాట్ ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ఫార్మాట్ పేరుని చెబుతూ ఉంటారు. ఎందుకంటే సుదీర్ఘంగా సాగే మ్యాచ్ లలో ప్రతిసారి ఆటగాల్లకు ఒక అతిపెద్ద సవాలు ఎదురవుతూ ఉంటుంది. తమ ప్రతిభను ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అందుకే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్టు ఫార్మాట్లో కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే సక్సెస్ అవ్వడం చూస్తూ ఉంటాము అయితే టెస్ట్ ఫార్మాట్లో  రాణించడమే గొప్ప విషయంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా ఆటగాడు ఇక మంచి ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు అంటే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాంటిది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోవడంలో కూడా రికార్డు సృష్టిస్తే.. ఇక అది ఎంత అరుదైన ఘనత అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ రూట్ ఇలాంటి రికార్డును సృష్టించాడు.


 ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న జో రూట్ ఒక అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న 9వ  క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పుడు వరకు అతను ఏకంగా ఆరు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇతని తర్వాత గ్రహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ అండర్సన్ ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకొని ఈ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: