క్రికెట్ లో ఎన్ని రకాల ఫార్మాట్లు ఉన్నప్పటికీ ప్రతి ఆటగాడు ఎక్కువగా ఇష్టపడే ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్. ఎందుకంటే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ అనేది ప్రతి ఆటగాడి ప్రతిభకు ఎప్పుడు సవాల్ విసురుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగే ఈ ఫార్మాట్ లోని మ్యాచ్లను ఆడాలి అంటే ఆటగాడు ఎప్పుడు ఫిట్టుగా ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి చిన్న సమస్య ఉన్న ఇక ఈ ఫార్మాట్లో ఆడటానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పాలి. అందుకే ఎంతో మంది క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్లోకి వచ్చిన కొంతమంది మాత్రమే ఈ ఫార్మాట్లో రాణిస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు.


 ఇంకొంతమంది క్రికెటర్లు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ కాలం పాటు కెరియర్ని కొనసాగించలేక అతి తక్కువ సమయంలోనే ఈ సాంప్రదాయమైన క్రికెట్ కి వీడ్కోలు పలికి మిగతా ఫార్మాట్లో కొనసాగడం చేస్తూ ఉంటారు. అయితే నేటి తరంలో ఇలా టెస్ట్ ఫార్మాట్లో కొంతమంది ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఫ్యూచర్లో తామే లెజెండ్స్ అంటూ ప్రతి మ్యాచ్ లోను నిరూపిస్తున్నారు. అలాంటి ఆటగాళ్లలో టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ కూడా ఒకరు. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో అతను ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 రోడ్డు ప్రమాదం బారిన పడిన కారణంగా దాదాపు ఏడాదిన్నర  పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న అతను ఇటీవల భారత జట్టులోకి వచ్చాడు. మరికొన్ని రోజుల్లో మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ లోకి పునరాగమనం  చేయబోతున్నాడు. ఈ క్రమంలోనె అతని గురించి మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్మెన్లలో రిషబ్ పంత్ కూడా ఒకరు అంటూ గంగూలి అభిప్రాయపడ్డాడు. బంగ్లాతో టెస్టులకు పంత్ ఎంపికైన నేపథ్యంలో ఆయన స్పందించారూ. రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మున్ముందు భారత టెస్టు ఆటగాళ్లలో తను ఒక దిగ్గజం అవుతాడు. పొట్టి ఫార్మాట్లో మాత్రం పంత్ మరింత మెరుగవ్వాల్సి ఉంది అంటూ గంగూలి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: