భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ గత సంవత్సరం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు అందరూ విచ్చేశారు. అయితే వీరికి వివాహానికి ముందే అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. కొద్ది రోజుల నుంచి ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ వారీ సోషల్ మీడియా అకౌంట్లలో విడాకుల విషయాన్ని పోస్ట్ చేశారు.


విడాకులు తీసుకున్నప్పటికీ తమ కుమారుడు అగస్త్యకు కో-పేరెంట్స్ గా ఉంటామని వెల్లడించారు. ఆ తర్వాత నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళింది. రెండు నెల క్రితం సెర్బియాకు వెళ్లిన నటాషా రెండు రోజుల క్రితమే మళ్ళీ ముంబైకి తిరిగి వచ్చింది. హార్దిక్ కారణంగానే ఈ జంట విడిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. హార్దిక్ తన భార్య, కుమారుడిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేయడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చేశాడట.


అయినప్పటికి నటాషా ఎంతో ఓపికగా భరించిందట. ఇక తన వల్ల కాకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ ఇరాక్ తో కలిసి ముంబై నగరంలో చక్కర్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో తిరిగిన సమయంలో కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వీరిద్దరూ ఇలా తిరగడం చూసిన నెటిజెన్లు వీరు వివాహం చేసుకుంటారేమోనని కామెంట్లు చేస్తున్నారు. అయితే నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇదివరకే జిమ్ వుంది వద్ద కనిపించింది. వీరి విషయం తెలిసిన తర్వాతే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: