ఇండియాలో క్రికెట్ కి ఉన్న విపరీతమైన క్రేజ్ దృశ్య ఇక ప్లేయర్లకు సంబంధించిన ఏ విషయం వెలుగులోకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా క్రికెటర్లకు సంబంధించి ప్రొఫెషనల్ విషయాల కంటే పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఇంటర్నెట్ జనాలు. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ హార్థిక్ పాండ్యా తరచూ వార్తల్లో  నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ ఏడాది ఐపీఎల్ కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన నాటి నుంచి కూడా అతను వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ జరిగిన సమయంలో అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్రశంసలు అందుకుని వార్తలో నిలిచాడు. ఇక ఆ తర్వాత ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులందరినీ కూడా అవక్కయ్యేలా  చేశాడు. అయితే విడాకుల తర్వాత హార్దిక్ భార్య నటాషా సెర్బియా వెళ్ళిపోయింది. ఇంకోవైపు హార్దిక్ పాండ్యా కూడా క్రికెట్లో బిజీ బిజీగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే హార్దిక్ పాండ్యాతో విడాకులు జరిగి ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు.. అంతలోనే అటు నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుకుంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఏకంగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కారులో వెళ్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ తో ముంబై వీధిలో చక్కర్లు కొడుతుంది నటాషా. ఇటీవల వీరిద్దరూ జిమ్లో కసరత్తులు చేసి బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇద్దరు కలిసి కెమెరాకు ఫోజులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నటాషా స్వయంగా డ్రైవ్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: