సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఛాంపియన్గా నిలవాలని ప్రతి జట్టు కూడా ఆశ పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకుంటూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం టీమిండియాకూ టెస్ట్ ఫార్మాట్లో అస్సలు కలిసి రావడం లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఫైనల్ వరకు చేరుకున్న టీమిండియా ఫైనల్ లో మాత్రం ఓడిపోతూ చివరికి ఇంటి బాట పడుతుంది.


 సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలి అనే టీమ్ ఇండియా కల కలగానే మిగిలిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా అదరగొట్టాలి అని భావిస్తుంది టీమిండియా. ఇక టి20 వరల్డ్ కప్ లో గెలిచినట్లుగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఇక ఇప్పుడు మళ్లీ టెస్ట్ ఫార్మాట్లో మ్యాచులు ఆడెందుకు సిద్ధమవుతోంది.


 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో అటు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడబోతుంది టీమ్ ఇండియా. అయితే ఇప్పటికే భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను ఓడించిన బంగ్లా ఇక ఇప్పుడు టీమ్ ఇండియాని కూడా ఓడించి చరిత్ర సృష్టించాలి అనే పట్టుదలతో ఉంది. దీంతో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. స్వదేశంలో భారత్ ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టలేకపోయాయి. పాకిస్తాన్లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ ఇండియాలో ఇండియాను ఇబ్బంది పెట్టడం మాత్రం చాలా కష్టం అంటూ తెలిపాడు. కాగా ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: