ఒకప్పుడు వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్ టీం గా హవా నడిపించిన పాకిస్తాన్ జట్టు.. రోజురోజుకీ వైభవాన్ని కోల్పోతుంది అన్న విషయం తెలిసిందే. దారుణమైన ప్రదర్శనలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఏకంగా వరల్డ్ కప్ లో స్ట్రాంగెస్ట్ టీం గా పేరుగాంచిన పాకిస్తాన్ ఇక ఇప్పుడు చిన్న చిన్న టీమ్స్ చేతుల్లో సైతం దారుణమైన పరాభవాలను చపిచూస్తూ ఉంది అని చెప్పాలి.


 అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కోచింగ్ సిబ్బంది దగ్గర నుంచి చైర్మన్ వరకు అన్ని విషయాల్లో మార్పులు చేర్పులు చేశారు. చివరికి కెప్టెన్లను కూడా మార్చారు. అయినప్పటికీ ఇక ఆ జట్టు మళ్ళీ గాడిలో పడలేక పోతుంది. ఇక ఫార్మాట్ ఏదైనా సరే చెత్త ప్రదర్శనలు చేస్తూ తేలిపోతుంది. దీంతో ఇక విమర్శలు తప్పడం లేదు. మొన్నటికి మొన్న సొంత గడ్డ మీదే బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం చేతిలో టెస్ట్ సిరీస్ లో క్లీన్స్ స్వీప్ అయింది పాకిస్తాన్. దీంతో ఇక పాక్ క్రికెట్ గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతోంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ గురించి ఆ దేశ మరో మాజీ క్రికెటర్ చేసిన సంచలన ఆరోపణలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఒక మ్యాచ్ ఫిక్సర్ అంటూ మరో మాజీ క్రికెటర్ బషీద్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. దేశం గురించి ఆలోచించని మాలిక్ లాంటి వాళ్లకు ను ఛాంపియన్స్ కప్ లో మెంటార్ గాని నియమించడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను కావాలనే మ్యాచ్లు ఓడానూ అంటూ షోయబ్ మాలిక్ ఒప్పుకున్నాడు. దీనికి అటు రామిజ్ రాజా ఇంటర్వ్యూ నే నిదర్శనం అంటూ బసిత్ అలీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: