టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే అందరిలాగానే టీమిండియాలోకి ఒక సాదాసీదా క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం ఇండియన్ క్రికెట్ ను మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్కు రారాజుగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. ఎంతోమందికి సాధ్యం కానీ అరుదైన రికార్డులను సృష్టించి ఇక మూడు ఫార్మాట్లలో కూడా అత్యుత్తమ ప్లేయర్గా గుర్తింపును సంపాదించుకున్నాడు.


 అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఇప్పటివరకు విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. అందుకే అభిమానులు అందరూ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చిన కొత్త ఆటగాడి లాగానే ఏదో సాధించాలి అనే కసి కోహ్లీలో కనిపిస్తూనే ఉంటుంది.


 ఇకపోతే మరికొన్ని రోజుల్లో అటు టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపైనే అందరి దృష్టి ఉంది. అయితే ఈ రికార్డుల రారాజు ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నాడు అన్నది తెలుస్తోంది. ఇప్పుడు వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్ లలో 26,952 పదవులు చేశాడు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే 27 వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు కోహ్లీ. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్ పేరిట ఈ రికార్డు ఉంది. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్లో సచిన్, సంగాకర, రికీ పాంటింగ్ లు మాత్రమే 27 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: