ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ క్రికెట్లో పరిమిత ఓవర్లో ఫార్మాట్లకు ఎంత క్రేజ్ పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పట్టిలా ఇప్పుడు టెస్టులకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో మ్యాచ్ జరుగుతుంది అంటే.. ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం విజేత ఎవరు అన్న విషయం కేవలం గంటల వ్యవధిలోనే తేలిపోతూ ఉంది. దీంతో ఇక ఫలితం కోసం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.


 అదే సమయంలో ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఆశించే బ్యాటింగ్ మెరుపులు బౌలింగ్ ఉరుములు అన్నీ కూడా పరిమితమైన ఫార్మాట్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఇక ఈ మధ్యకాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ని చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లు సైతం టెస్టు ఫార్మాట్ ను దూరం పెట్టి పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో ఆడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇలా గత కొన్ని నెలల నుంచి కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి మాత్రమే పరిమితమైన ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒకరు అని చెప్పాలి.


 అప్పుడెప్పుడో 2018లో హార్దిక్ పాండ్యా చివరిసారిగా టెస్ట్ ఫార్మాట్లో మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి గాయాల బెడద వేధించడంతో మళ్లీ సుదీర్ఘమైన ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం వన్డేలు t20 లలో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ ఏడాది జరగబోయే రంజీ ట్రోఫీతో ఆయన పునరాగమనం చేయబోతున్నాడట. ఇటీవల నెట్స్ లో రెడ్ బాల్ తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలు హార్దిక్ షేర్ చేశాడు. దీంతో త్వరలో అతను టెస్ట్ ఫార్మాట్లోకి రాబోతున్నాడు అంటూ ఇక క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: