ఐపీఎల్ లో ప్రతి మూడేళ్లకోసారి మెగా వేలం నిర్వహించాలనే నియమాన్ని పాటిస్తూ వస్తున్నారు. చివరిసారి ఐపీఎల్ 2022 కోసం మెగావేలం నిర్వహించడం జరిగింది. ఈసారి ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు మెగా వేలంలో విక్రయానికి రాబోతున్నారు. దీని కారణంగా ఐపీఎల్ మెగా వేలం మరింత ఉత్తేజకరంగా మారబోతోంది.


ఐపీఎల్ మెగా వేళానికి ముందు రూల్స్, రిటేన్షన్ పాలసీకి సంబంధించి బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో మెగా వేలానికి ముందు మీడియా నివేదికలలో అనేక రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. మెగా వేలానికి సంబంధించి అభిమానుల మనసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టు దక్కించుకోవాలనుకున్న భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానికి మరోసారి నిరాశ ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి.


గుజరాత్ టైటాన్స్ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆదానీ గ్రూప్ చివరి నిమిషంలో ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ అయిన సీవీసీ క్యాపిటల్ తో ఆదాని గ్రూప్, టొరెంట్ గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ భాగస్వామ్యం కోసం అనేకరకాల చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.


సీవీసీ క్యాపిటల్ కు చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టులో మెజారిటీ వాటాను కొనేసి... మైనారిటీ హోల్డింగ్ ని నిలుపుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంది. ఇది ఇలా ఉండగా...గుజరాత్ టైటాన్స్ జట్టు.. గత రెండు సీజన్‌ ల నుంచి దారుణంగా విఫలమౌవుతోంది. అటు గత ఐపీఎల్‌ 2024 లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్‌ గా గిల్‌ నియామకం అయ్యారు. పాత కెప్టెన్‌ హర్ధిక్‌ పాండ్యా ముంబై కెప్టెన్‌ గా నియామకం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: