ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు ఇక చిరకాల ప్రత్యర్థి ఎవరు అంటే పొరుగును ఉన్న పాకిస్తాన్ జట్టు పేరును చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అదే వరల్డ్ క్రికెట్లోనే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే పాకిస్తాన్ తర్వాత ఇలా ఇండియాకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగిన టీం ఏది అంటే ఆస్ట్రేలియా పేరు చెబుతూ ఉంటారు.


 ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ టీం లో ఒకటిగా కొనసాగుతుంది. దీంతో టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు ఏ ఫార్మాట్లో పోరు జరిగిన అది ఎంతో ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గావాస్కర్ ట్రోపీని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సిరీస్ లో విజయాన్ని ఏకంగా వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచినంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం.


 అయితే గత కొన్ని నెలల నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు పై చేయి సాధిస్తూ ఉంది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డ మీదే దెబ్బకొడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది నవంబర్లో మరోసారి ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నీ జరగబోతుంది. ఈ ట్రోఫీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆస్ట్రేలియా బౌలర్ మిచేల్ స్టార్క్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  కోహ్లీతో పోరు కోసం ఎదురుచూస్తున్న అంటూ  స్టార్క్ చెప్పుకొచ్చాడు. అతనితో పోరాటం ఎప్పుడు బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం ఒకరితో ఒకరం. చాలా క్రికెట్ ఆడాము. మా పోరాటంలో మజాని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అతను నా బౌలింగ్లో రన్స్ చేశాడు. నేను అతన్ని అవుట్ చేశాను. ఇక ఈసారి పోరు ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టార్క్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: