గత కొన్ని నెల నుంచి కూడా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో చివరి అడుగులో తడబడుతూ విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోతుంది టీమిండియా. ఇక ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదం చేయకుండా అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మరోసారి డబ్ల్యూటీసి ఫైనల్ కు దూసుకు వెళ్లాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా బంగ్లాదేశ్ తో ఈ టెస్ట్ సిరీస్ జరగబోతుంది. అయితే ఈ సిరీస్ కోసం బంగ్లా జట్టు ఇండియా పర్యటనకు రాబోతుంది అన్న విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్లో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు సాగాలని ఆశపడుతుంది టీమిండియా. కాగా ఈనెల 19వ తేదీ నుంచి బంగ్లా, ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే భారత చిరకాల ప్రవర్తి అయిన పాకిస్తాన్ చెప్పిన వారి సొంత గడ్డ మీదే ఓడించి టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా ఇండియాకు  కూడా ఇలాంటి షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది.


 అయితే ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ తో మొదలయ్యే తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. 1932లో తొలిసారిగా టెస్ట్ ఆడిన ఇండియా అప్పటినుంచి.. 579 మ్యాచులు ఆడింది 178 మ్యాచ్లో ఓడి.. 178 మ్యాచ్ లలో గెలిచింది. 228 మ్యాచులు డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్ టై అయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పై టెస్టులో గెలిస్తే ఇక దేశ టెస్ట్ చరిత్రలో తొలిసారిగా ఓటముల సంఖ్య కంటే గెలుపుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: