ఇండియన్ క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఇక భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఎంతో మంది యువకులు ఇక బంతి బ్యాట్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఇక ఇలా లక్ష్యాన్ని చేరుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశవాళీ క్రికెట్లో జరిగే  టోర్నీలలో  అదరగొడుతున్నారు అని చెప్పాలి.



 అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ గా మారి పోతున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఎంతోమంది యంగ్ ప్లేయర్లు బ్యాటింగ్లో సృష్టిస్తున్న విధ్వంసం ఇండియన్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. తాను టీమిండియా ఫ్యూచర్ అనే విషయాన్ని కేవలం మాటలతో కాదు.. తమ ఆట తీరుతోనే నిరూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 యువ ఆటగాడు వీరోచితమైన సెంచరీ గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. కేరళ క్రికెట్ లీగ్ లో త్రిశూర్ టైటాన్స్ ఆటగాడు విష్ణు వినోద్ బ్యాటింగ్ విధ్వంసం ప్రోత్సహించాడు. అలిప్పీ రేపిల్స్ తో జరిగిన మ్యాచ్లో 65 బంతుల్లోనే 139 పరుగులు చేశాడు. ఇందులో 17 సిక్సర్లు ఐదు ఫోర్లు ఉన్నాయి. తొలత అలిపి 20 ఓవర్లలో 181 / 6 పరుగులు చేయగా.. వినోద్ వీర విహారం తో త్రిశూర్ జట్టు 12.4 ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేరుకుంది. కాగా అతన్ని ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. అంతకుముందు ఢిల్లీ, సన్రైజర్స్ జట్ల తరఫున కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: