బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్. ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఐపీఎల్లో ఇక ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థులుగా కొనసాగిన ఆటగాళ్లు అటు ఐపిఎల్ లో మాత్రం సహచరులుగా మారిపోయి ఒక జట్టు తరుపున ఆడటం చేస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ఈ ఆటను చూడటానికి క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఆడితే చాలు అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఎంతో సులభంగా మ్యాచులు ఆడొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు.


 అయితే ఐపీఎల్ మాత్రమే కాదు ఎన్ని దేశవాళీ టోర్నీలు ఆడినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో మాత్రం అనుభవం మరోలా ఉంటుంది అని ఎంతోమంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇలా ఐపీఎల్లో స్నేహితులుగా ఉన్న వారే అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా ప్రత్యర్ధులుగా మారిపోతూ ఉంటారు. ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో భిన్నమైన అనుభవం ఎదురవుతూ ఉంటుంది అని చెప్పాలి. తనకు ఇలాంటి ఒక విచిత్రమైన అనుభవమే ఎదురయింది అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్.


 ఐపీఎల్ లో స్నేహితుడిగా ఉన్న ప్లేయర్ అటు అంతర్జాతీయ క్రికెట్లో నాతోనే స్లెడ్జింగ్ చేసేందుకు ప్రయత్నించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీంలో కలిసి ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం స్లెడ్జింగ్ చేయడంతో షాక్ అయ్యాను అంటూ ధృవ్ జురెల్ అన్నాడు. ఈ ఏడాది రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. జో రూట్ అదే పనిగా నన్ను స్లెడ్జింగ్ చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగగా మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నాం అంటూ అతను సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యా అంటూ జురెల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: