వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో గత కొంత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాకు తీవ్ర నిరాశ మిగులుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఎంతోమంది ప్రత్యర్థులను ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో దూసుకుపోయి ఫైనల్ కు చేరుతూ ఉంది టీమ్ ఇండియా. కానీ ఫైనల్ లో మాత్రం ఓడిపోయి చివరికి విశ్వవిజేతగా నిలిచే అవకాశాలను కోల్పోతుంది అన్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో కూడా ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకొని ఇక ట్రోఫీ అందుకోవాలని ఆశ పడుతూ ఉంది.



 ఇప్పటికే మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ అందుకున్న టీమిండియ.. ఇక ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందుకొని రికార్డు సృష్టించాలని భావిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత అటు బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం బంగ్లా జట్టు భారత పర్యటనకు వస్తుంది. అయితే మొన్నే పాకిస్తాన్ జట్టును ఓడించి క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంకోవైపు భారత జట్టును సొంతగడ్డపై ఓడించడం మహా మహా జట్లకు సైతం సాధ్యం కాదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు టీమ్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు  కూడా అంచనా వేసుకుంటున్నారు.


 కాగా ఈనెల 19వ తేదీ నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుండగా.. ఎలాంటి వ్యూహాలతో భారత జట్టు బరిలోకి దిగిపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రాక్టీస్ పిచ్ లలో రెండు రకాలు కనిపిస్తూ ఉండడం గమనార్హం. నల్లమట్టి పిచ్ పై స్పిన్నర్లు ఎర్రమట్టి పిచ్ పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటి పైన బ్యాటర్లు కూడా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ ఫేస్ కి అనుకూలమైన ఎర్రమట్టి పిచ్ కోసం ఇండియా రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా ఎలాంటి వ్యూహంతో బలిలోకి దిగిపోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: