మొన్నటి వరకు భారత క్రికెట్లో తెలుగు క్రికెటర్ల హవా కాస్త తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఐపీఎల్ కారణంగా ఎంతో మంది యంగ్ తెలుగు ప్లేయర్స్ తెరమీదకి రాగలుగుతున్నారు అని చెప్పాలి. దేశవాళి క్రికెట్లో బాగా ప్రదర్శన చేసి ఇక ఐపీఎల్ లాంటి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న టోర్నీలలో అవకాశాలు దక్కించుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లాంటి టోర్నీలో కూడా అదరగొడుతూ అటు టీమిండియాలోకి కూడా వచ్చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా గత కొంతకాలం నుంచి టీమిండియాలో మాత్రమే కాకుండా అటు ఐపిఎల్ లో కూడా నిలకడైన ప్రదర్శనకు కేరాఫ్ అడ్రెస్ గా మారి తెలుగు ప్రేక్షకులు అందరినీ తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ప్లేయర్లలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్న ఇతగాడు.. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్లందరూ విఫలమైన వేల నిలకడైన ఆట తీరుతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోగలిగాడు. ఇక తర్వాత సీజన్లలో కూడా అదే రీతిలో ఆడుతూ ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఏ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. వరస మ్యాచ్లతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఈ తెలుగు క్రికెటర్ బ్యాటింగ్ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా శతకంతో చలరేగిపోయాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డి తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ 177 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇకపోతే ఇండియా ఏ జట్టు 477 పరుగులకు పైగా లీడ్తో ఈ మ్యాచ్ లో దూసుకుపోతుంది అని చెప్పాలి. కాగా తిలక్ వర్మ ఇలా సెంచరీ తో చెలరేగిపోవడంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: