అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో కోల్కతా జట్టు మెంటార్గా వ్యవహరించిన గౌతం గంభీర్.. ఇక ఆ జట్టు టైటిల్ గెలవడంలో తన వ్యూహాలను అమలు చేసి కీలకపాత్ర వహించాడు. అయితే ఇప్పుడు ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలను చేపట్టి.. భారత జట్టును తన నేతృత్వంలో ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక జట్టులో అనుహ్యమైన మార్పులు తీసుకువస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్ గురించి మాజీ ప్లేయర్ పియుష్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ నుంచి ఎప్పుడు మద్దతు లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఆటగాళ్లలో ఎప్పుడు స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. స్వేచ్ఛగా ఆడమని ధైర్యాన్ని చెబుతూ ఉంటారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే.. మీరు ప్రదర్శన చేయకపోయినా సరే గౌతమ్ గంభీర్ అండగా నిలిచి వరుసగా అవకాశాలు ఇస్తారు. ఏ ఆటగాడికైనా ఇదే కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గ్రూపులో ఎంతో దూకుడుగా ఉండే గౌతమ్ గంభీర్.. వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సౌమ్యుడు అంటూ పీయూష్ చాలా చేసిన కామెంట్స్ వైరల్ మారిపోయాయి.