ఈ నెల 19వ తేదీ నుంచి బంగ్లాదేశ్ తో.. మొదటి టెస్ట్ ఆడనుంది టీమిండియా. ఈ తరుణంలోనే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు భయంకరమైన బ్యాటింగ్ చేస్తూ... ప్రాక్టీస్ మ్యాచ్ లో స్టేడియం గోడ బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. బంగ్లాదేశ్ ల పైన.. కూడా అచ్చం ఇలాగే రెచ్చిపోవాలని విరాట్ ఫాన్స్ అంటున్నారు.
ప్రతిసారి జీరో కు అవుట్ అయి అందరిని నిరాశపరచాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు... బంగ్లాదేశ్ తో మ్యాచ్లో ఉన్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ తొందరగా ఫామ్ లోకి రావాలని కొంతమంది అంటున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే... టీమిండియాను అడ్డుకునే వాడే ఉండడని... చెబుతున్నారు. ఇక అటు ఐపీఎల్ టోర్నమెంట్ లో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు... ఈసారి కూడా విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.