సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్, ఇండియా జట్లను చిరకాల ప్రత్యర్ధులుగా  పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్, ఇండియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అది వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ మ్యాచ్ వీక్షిస్తూ ఉంటాయి. అయితే పాకిస్తాన్ తర్వాత ఇలా భారత్కు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగే టీం ఏది అంటే ఆస్ట్రేలియా అని చెబుతారు భారత క్రికెట్ ప్రేక్షకులు.


 వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు పోరు జరిగిన ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది  ఇక ఇరు జట్ల ఆటగాళ్లు సాదాసీదా మ్యాచ్ లోకి గెలుపును కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ అయితే వరల్డ్ కప్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ విజయాన్ని వరల్డ్ కప్ విజయంగానే భావిస్తూ ఉంటారు ప్లేయర్లు.  గత కొంతకాలం నుంచి  వరుసగా సిరీస్లను అందుకుంటూ ఆస్ట్రేలియనూ దెబ్బకొడుతూ వస్తుంది టీమిండియా  ఇక ఇప్పుడు మరి మరికొన్ని రోజుల్లో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇదే విషయంపై స్పందించిన భారత స్టార్ బౌలర్ షమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత్ హ్యాట్రిక్ కొట్టబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు  ఇండియానే ఈ సిరీస్ లో ఫేవరెట్  అందులో డౌట్ లేదు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. కానీ తప్పకుండా గెలిచి తీరుతాం అంటూ పేర్కొన్నాడు. ఇక కం బ్యాక్ విషయంలో తాను కంగారు పడటం లేదని.. పూర్తిగా బలం పుంజుకున్న తర్వాత గ్రౌండ్లో అడుగు పెట్టాలి. లేదంటే మళ్లీ ఇబ్బంది పడాలి. అందుకే ఎంత ఫీట్ అయితే అంత మంచిది అంటూ షమీ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: