2025 ఐపీఎల్ సీజన్లో ఏం జరగబోతుంది.. ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళబోతున్నాడు. ప్రస్తుతం ఇదే విషయం గురించి ఇండియన్ క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది. దీంతో ఈ మెగా వేలం కోసం ఆయా ప్రాంచైజిలు. ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయ్ తెలుస్తోంది. అదే సమయంలో కొంతమంది ఆటగాళ్లు ఇక జట్టును మారె అవకాశాలు ఉన్నాయి అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి.


 ఇప్పటికే ఐపీఎల్ లోని కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా తమ జట్టు కెప్టెన్లను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. దీంతో టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నవారు పలనా టీం లోకి వెళ్ళబోతున్నారంటూ ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు ఐపీఎల్ లో లక్నో కెప్టెన్ గా కొనసాగిన టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కే ఎల్ రాహుల్ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను పాత టీం అయినా ఆర్సీబీలోకి వెళ్లబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.


 అయితే కేఎల్ రాహుల్ ఆర్సిబి లోకి వస్తే బాగుండు అని ఆట అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ కి కూడా ఇదే విషయం పై ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే అతను చేసిన వ్యాఖ్యలు అతడు నిజంగానే ఆర్సిబి లోకి వెళ్లబోతున్నాడు అనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి అని చెప్పాలి. మీరు మళ్లీ ఆర్సిబి జట్టు తరఫున ఆడితే చూడాలని ఉంది అంటూ ఒక అభిమాని సోషల్ మీడియాలో అడిగాడు. దీనికి కేఎల్ రాహుల్ బదులిస్తూ లెట్స్ హోప్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అతను ఆర్సిబి జట్టులోకి వెళ్లేందుకు ఇప్పటికే చర్చలుజరుగుతున్నాయి అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: