టీమ్ ఇండియాలో సీనియర్స్ స్పిన్నర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన ఆట తీరుతో ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. వరల్డ్ క్రికెట్లో ఉన్న బెస్ట్ స్పిన్నర్లలో అతను ఒకరు అనడంలో సందేహం లేదు. అంతే కాదు స్పిన్ బౌలింగ్లో అతను లెజెండరీ క్రికెటర్ గా కూడా ఉన్నాడు. అయితే సీనియర్ గా కొనసాగుతున్న అశ్విన్ ను తెలివైన బౌలర్ అని కూడా పిలుస్తూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు.


 ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అనే విషయంపై అశ్విన్.. ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే అతను బౌలింగ్ చేస్తున్నాడు అంటే పరుగులు చేయడం కాదు ముందు వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు ఐసీసీ లోని క్రికెట్ రూల్స్ అన్నింటినీ కూడా అవపాసన పట్టిన క్రికెటర్ గా అతనికి పేరుంది. అయితే ఇప్పటికే దశాబ్దాన కాలం నుంచి టీమిండియా తరఫున ఆడుతున్న ఇతగాడు రిటైర్మెంట్ కి దగ్గరపడ్డాడు అంటూ గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నాయి.


 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విన్ కు రిటైర్మెంట్ గురించి ఇలాంటి ప్రశ్నలు ఎదురయింది. ఈ క్రమంలోనే అశ్విన్ ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన ఆటను మెరుగుపరచుకోలేను అని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచన చేస్తాను అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు అంటూ తెలిపాడు. స్పిన్నర్ అనిల్ కుంబ్లె రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతమైతే ఎలాంటి లక్ష్యం లేదని ఆటను ప్రేమిస్తున్నాను అంటూ తెలిపాడు. ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ ఆయన కారణంగా ఇప్పటికే కొన్ని ఫార్మాట్లకు సుదీర్ఘకాలం నుంచి సెలెక్ట్ కావట్లేదు. టెస్ట్ ఫార్మాట్లో మాత్రం తరచు అవకాశాలు దక్కించుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: