వినాయక చవితి వచ్చిందంటే చాలా ఊరు వాడా అని తేడా లేకుండా ప్రతి చోట కూడా పండగ శోభ సంతరించుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి సంబరాలలో నిమగ్నం అవుతూ ఉంటారు. ఈనెల ఏడవ తేదీన ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. వినాయక చవితి రోజున తమకు నచ్చిన గణనాథుడు విగ్రహాలను తెచ్చి ప్రతిష్టించుకున్న వారు ఇక ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు.


 ఎక్కడ చూసినా కూడా ఇలా వినాయక నిమజ్జన ఊరేగింపులు జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక డీజేలు బ్యాండ్ మేళాలు ఏర్పాటు చేసుకొని.. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు పెద్దలు. చిన్నలు అందరూ కూడా కాలు కదిపి డాన్సులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం  అయితే ఇలా వినాయకుడికి తొమ్మిది రోజులు పాటు నిష్టగా పూజలు చేసిన తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో నిమర్జనం చేయడం ఎన్నో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.


 ఇలా వినాయకుడి నిమజ్జనం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. ఇప్పుడైతే వినాయకుడి విగ్రహాలను పిఓపితో తయారుచేస్తున్నారు. కానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రు మట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేసేవారు. వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత లంబోధరుడుని నిపూజించేందుకు 21 రకాల పత్రిలు వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయట. ఈ క్రమంలోనే ప్రవహించే నదులు వాగులతో పాటు చెరువల్లో నీరు కూడా అటు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతుంది. అందుకే ఒండ్రు  మట్టి వినాయకులను నిమజ్జనం చేసి పత్రిలను వాటిలో  వదిలితే నీటిని శుభ్రం చేయడంతో పాటు ఔషధ గుణాలు పెరుగుతాయట.  ఇక అప్పట్లో ప్రజలందరూ కూడా ఇలా చెరువులు, వాగుల్లోని నీరు తాగేవారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: