ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లలోను సత్తా చాటుతు అదరగొట్టేస్తూ ఉన్నాడు జస్ ప్రీత్ బూమ్రా. అతను బౌలింగ్ వేస్తున్నాడు అంటే చాలు ఏకంగా ప్రత్యార్థుల సైతం వనికి పోతుంటారు. అతను వేసే యార్కర్లకు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దగ్గర అసలు సమాధానమే ఉండదు. అంతల తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కేవలం బౌలింగ్ లోనే కాదు బౌలింగ్ వేసే స్టైల్ లోను బుమ్రాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుమ్రా ప్రతిభ పై స్పందించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అతనిపై ప్రశంసలు కురిపించాడు.
బూమ్రా లాంటి బౌలర్ కేవలం తరానికి ఒక్కడు మాత్రమే వస్తాడు అంటూ అశ్విన్ ప్రశంసించాడు. అలాంటి వారి గొప్పతనాన్ని అందరూ గుర్తించాలి అంటూ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్లో ఎప్పుడు బ్యాటర్లకే స్టార్ స్టేటస్ ఉంటుంది. ఇది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయినప్పటికీ కూడా బుమ్రకు కూడా అంత గౌరవం దక్కుతూ ఉండడం ఎంతగానో ఆనందంగా ఉంది అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. నా దృష్టిలో ప్రస్తుతం భారత్ లో అత్యంత విలువైన క్రికెటర్ బుమ్రానే అంటూ తెలిపాడు. కాగా విరాట్ కోహ్లీ రోహిత్ లతోపాటు బుమ్రాకి కూడా బీసీసీఐ కాంట్రాక్టులో ఏ ప్లస్ గ్రేడ్ ఉంది అనే విషయం తెలిసిందే.