టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ఎప్పుడు పోరు జరిగిన కూడా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ అయితే మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియానే హవా నడిపిస్తూ వస్తుంది. వరుసగా రెండుసార్లు ఈ సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోని ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో ఇటు ఇండియన్ క్రికెట్ లో కూడా ఈ బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ గురించి చర్చ జరుగుతుంది.


 ఈ క్రమంలోనే ఈ సిరీస్ నేపథ్యంలో  భారత జట్టుకు సవాలు విసిరే ఆటగాడు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. ముందుగా ట్రాఫిక్ హెడ్ పేరు వినిపిస్తుంది. టీం ఇండియాతో మ్యాచ్ అంటే ట్రాఫిక్ హెడ్ కి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. మిగతా జట్లపై విఫలమైన అటు టీమ్ ఇండియా పై మాత్రం వీర బాదుడు బాధతో ఉంటాడు. ఇక ఐసిసి టోర్నీలలో కూడా ఇప్పుడు వరకు రెండు సార్లు ఏకంగా ఇండియాను ఛాంపియన్ కాకుండా ఆపగలిగాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా టైటిల్ డ్రీమ్ పై నీళ్లు చల్లాడు.


 2023 డబ్ల్యూటీసి ఫైనల్ లో ఏకంగా 193 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 137 పరుగులు చేసి ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలపగలిగాడు. ఇంటర్వ్యూలో బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడాడు ట్రావిస్ హెడ్. ఈ టీమిండియా నా ఫేవరెట్ టీం ఏమి కాదు. ఆ జట్టు తో నాకు పెద్దగా పోటీ ఉంటుంది అని కూడా అనుకోను. టీమిండియాతో ఆస్ట్రేలియా ఎక్కువ మ్యాచ్లు ఆడుతుంది అంతే. అంతేకాకుండా నేను గత కొన్నెల్ల మంచి ఫామ్ లో ఉన్నానని అనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ట్రావిస్ హెడ్. ఒకరకంగా టీమిండియాను తాను పెద్దగా పోటీగా భావించను అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: