భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ మరో రెండు రోజులలోనే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని బంగ్లా బౌలర్లు ఈ విధంగా అడ్డుకుంటారనే దానిపై ప్రతి ఒక్కరి దృష్టి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతడు మరోసారి ఫుల్ ఫామ్ లోకి వస్తే బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. దీంతో నహీద్ రానా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్ వంటి బంగ్లా బౌలర్లు విరాట్ తో దూకూడును అడ్డుకోవడానికి ప్లాన్స్ వేస్తున్నారు.


ఈ క్రమంలోనే కోహ్లీ తన పునరాగమనం ఘనంగా ఉండాలని భావిస్తున్నాడు. దీంతో నెట్స్ లో తీవ్రంగా కష్టపడుతున్నారు. సోమవారం నెట్స్ లో జస్ప్రీత్ బూమ్రా, విరాట్ కోహ్లీ సరదాగా గొడవపడ్డారు. నెట్స్ నో బుమ్రా బౌలింగ్ ఎదుర్కొన్న కోహ్లీ అతని బంతులకు తడబడినట్టుగా కనిపిస్తోంది. బుమ్రా వేసిన ఇన్ స్వింగర్ పసిగట్టలేక విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడు అంటూ ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ పేర్కొన్నారు.


అవుట్ అవుట్ అంటూ బమ్రా అప్పిల్ చేయగా.... నాటౌట్ అని కోహ్లీ వాధించాడు. బంతి డౌన్ ద లెగ్ స్టంప్ పోతుందని చెప్పాడట. కానీ బమ్రా అవుట్ అని పట్టుబట్టాడు. డీఆర్ఎస్ కావాలంటూ సైగలు చేశాడు. ఇక బమ్రాతో పాటు 24 ఏళ్ల నెట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్ లోను విరాట్ కోహ్లీ తడబడ్డాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రానా బౌలింగ్ శైలి కలిగి ఉండే గుర్నూర్ బ్రార్.... విరాట్ కోహ్లీని ఎక్స్ట్రా బౌన్స్ తో ఇబ్బంది పెట్టారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారుతుంది.


ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. చాలా భయంకరంగా ఆదివారం రోజున బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే చపాక్ స్టేడియం కి సంబంధించిన గోడ...  కూడా బద్దలైనట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: