టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన ఆట తీరుతో ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్గా గుర్తింపును సంపాదించుకున్నాడు. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టులోకి వచ్చినప్పటికీ అతి తక్కువ సమయంలోనే తాను ఇక క్రికెట్ చరిత్రలో లెజెండరీ ప్లేయర్ గా నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. మూడు ఫార్మాట్లలో కూడా ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించి తన తరానికి తనను మించిన ఆటగాడు మరొకరు లేరు అని అందరికీ రుజువు చేశాడు.


 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్దన్నర కాలం గడిచిపోతున్న ఇంకా రికార్డులో వేట కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇప్పటివరకు అతని కెరియర్ లో ఎంతో మంది దిగ్గజ ప్లేయర్స్ సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరితో కూడా రికార్డుల రారాజు అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఎంత స్టార్ క్రికెటర్ గా ఎదిగినప్పటికీ యువ క్రికెటర్ల ఎంతో సరదాగా గడుపుతూ తన అనుభవాలను వారికి పంచుతూ ఉంటాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల విరాట్ కోహ్లీ గురించి యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యంగ్ ప్లేయర్లకు ఎప్పుడు అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తూ ఉంటాడు అంటూ సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల ఫ్యాషన్ ఆత్మవిశ్వాసంలో ఆయనకు ఎవరు సాటిరారు అంటూ క్రీడా చానల్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో 2015 -18 మధ్య విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో తాను ఆర్సీబీ తరఫున ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలని నా కల భవిష్యత్తు లో నిజం అవుతుంది అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: