టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా యాక్టివ్ క్రికెటర్ గా ఉన్నప్పుడు ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. కానీ ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ధోని విషయంలో అలా కాదు. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ కొంచమైన తగ్గలేదు.


 అతను అందరిలాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు. అయినప్పటికీ ధోని గురించి ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోని అభిమానులందరిలో కూడా ఒకే విషయంపై ప్రశ్న తలెత్తుతుంది. 2025 ఐపీఎల్ సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే విషయంపై అయితే 2019లో ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ధోని రిటైర్మెంట్ గురించి చర్చ వస్తూనే ఉంది. కానీ మహేంద్రను మాత్రం ప్రతి ఐపీఎల్ సీజన్లో ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.


 అయితే గత ఏడాది సీఎస్కే కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేసిన ధోని.. ఐపిఎల్ కెరీర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరూ అనుకుంటుండగా.. ఇదే విషయంపై సురేష్ రైనా కూడా స్పందించాడు. మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఐపిఎల్ సీజన్లోనూ ఆడాలని సురేష్ రైనా ఆకాంక్షించాడు. దేశమంతా మహీ ఆటను చూడాలని అనుకుంటుంది. గత సీజన్లో ఆయన మెరుగైన ప్రదర్శన చేశారు. ప్రతి ప్లేయర్ కోచ్ లు మిస్టర్ కూల్ ఆటను మరింతకాలం చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు రైనా. అయితే 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మెగా వేలం కూడా జరగబోతుంది ఇక ఈ మెగా వేలం తర్వాత ధోని జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై అభిమానులకి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: