పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు అంచనాలు లేకుండా బరిలో దిగుతూ ఎన్నో సంచలన సృష్టిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు భారీ అంచనాలు పెట్టుకుంటే అంచనాలను తలకిందులు చేస్తూ తుస్సుమంటూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఎలా ప్రదర్శన చేస్తుంది అని ఊహించడం చాలా కష్టం ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో గెలవడం గెలుస్తుంది. అనుకుంటున్న మ్యాచ్లో దారుణమైన ఓటమిని చవిచూటడం కేవలం పాకిస్తాన్ జట్టుకు మాత్రమే చెల్లుతుంది.



 అందుకే పాకిస్తాన్ ఆట తీరూపై ఇక సొంత అభిమానులు కూడా ఎప్పుడు కన్ఫ్యూషన్ లో ఉంటారు. గెలుస్తుందా లేదా అనే విషయంపై ఒక నమ్మకానికి ముందే వచ్చేయరు. అయితే కేవలం క్రికెట్లో మాత్రమే కాదు ఇక అన్ని క్రీడల్లో కూడా పాకిస్తాన్ జట్టుతో ఇలాగే ఉంటుంది. సాధారణంగా ప్రపంచ కప్ లాంటి ఒక టోర్నమెంట్లో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో ఒక టీం తమను ఓడించింది అంటే.. ఆ టీంను ఎలా ఓడించాలి ఎప్పుడు సమయం వస్తుందా అని ఓడిపోయిన జట్టు ప్రతీకారంతో ఎదురు చూడాలి. కానీ పాకిస్తాన్ జట్టు ఇలా చేయలేదు. తమను ఓడించిన చెట్టునే గెలిపించేందుకు సిద్ధమైంది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్స్ లో చైనాకు పాకిస్తాన్ ఆటగాళ్లు మద్దతు తెలుపడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఎవరి చేతిలో అయితే సెమీఫైనల్ లో ఓడిపోయిందో.. ఇక వారికే సపోర్ట్ చేయడానికి పాకిస్థాన్లోని ఆటగాళ్లందరూ స్టేడియం కు చేరుకొని మద్దతు ప్రకటించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు చైనా జెండాలను చేత పట్టుకుని కనిపించారు. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఎవరికీ మద్దతు ఇస్తుంది స్పష్టంగా తెలుస్తోంది అంటూ కామంటేటర్ కూడా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పాకిస్తాన్లో ఇదే దౌర్భాగ్యం ఎవరికి మద్దతు తెలిపాలో కూడా తెలియని పరిస్థితి అంటూ నేటిజన్స్ ఈ ఘటనపై కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: