వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతూ ఉంది టీమిండియా. అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఇండియాలో క్రికెట్ కి ఉన్న విపరీతమైన క్రేస్ దృశ్య అటు భారత క్రికెట్ బోర్డుకి కూడా భారీ మొత్తంలోనే ఆదాయం సమకూరుతూ ఉంటుంది. అందుకే ఇక బిసిసిఐ కూడా అటు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది. ఐసీసీ కి కూడా నిధులు అందిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే భారత జట్టుతో మ్యాచ్ ఉంది అంటే చాలు అగ్రశ్రేణి టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. అలాంటిదిది ఏకంగా భారత జట్టుతో ఇండియా లోనే మ్యాచ్ ఉంటే గెలుస్తాము అనే నమ్మకాన్ని మాత్రం పెద్దగా పెట్టుకోవు ప్రత్యర్థి టీమ్స్. ఎందుకంటే ఇండియాలో టీమిండియాని ఓరించడం అంత కష్టమైన విషయం. కానీ కొన్ని టీమ్స్ మాత్రం తాము టీమిండియాని అలవోకగా ఓడించేస్తాము అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వాటి గురించి కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 తమ ప్రత్యర్థి ఎవరు అనే విషయం కంటే మ్యాచ్ గెలుపు పైనే తాము ఎక్కువగా దృష్టి పెడతాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. చెన్నై వేదికగా గురువారం నుంచి ఇండియా బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ పై మొన్నటికీ మొన్న విజయం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు టీం ఇండియాని కూడా ఓడిస్తాము అంటూ చెబుతుంది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ప్రతి జట్టు టీమ్ ఇండియా అని ఓడించాలని అనుకుంటుంది. ఎందుకంటే అలా ఓడిస్తే వారికి కిక్కు వస్తుంది. ఇలా గెలుస్తామని ఆలోచిస్తూ ఆ మజా అయినా పొందనివ్వండి. మేము గెలుపు పై దృష్టి సారిస్తాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: