ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పురుష క్రికెటర్లతో సమానంగానే అన్ని ఫార్మాట్లలో మ్యాచ్ వేతనాలను అటు మహిళా క్రికెటర్లకు చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే బిసిసిఐ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత.. మరికొన్ని క్రికెట్ బోర్డులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం మహిళా క్రికెట్కు మరింత ప్రోత్సాహాన్ని అందించే విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో పురుషుల క్రికెట్ తో పోల్చి చూస్తే మహిళల క్రికెట్లో ప్రైస్ మనీ చాలా తక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు ఈ ప్రైజ్ మనీని భారీగా పెంచేస్తూ ఐసిసి సంచలన నిర్ణయం తీసుకుంది. పురుషుల టీం తో సమానంగానే టీ20 వరల్డ్ కప్ ఉమెన్స్ టీంకు ప్రైజ్ మనీ ఇవ్వడానికి సిద్ధమయింది. ఈ క్రమంలోనే t20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకి 2.34 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. గత ఏడాది ప్రైస్ మనీ తో పోల్చి చూస్తే ఇది 134% ఎక్కువ రన్నర్ ఆఫ్ టీంకి 1.17 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధమైనది. కాగా అక్టోబర్ మూడవ తేదీ నుంచి మహిళ t20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతోంది.