ఇకపోతే ఈ గ్రౌండ్ లో నజ్ముల్ హసన్ శాంటో కంటే ముందు, ఇంతకు ముందు ఒక్కసారి మాత్రమే కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పుడు చెన్నై టెస్టులో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రపంచంలోనే రెండో కెప్టెన్. చివరిసారిగా 1982లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇంగ్లండ్ కెప్టెన్ కీత్ ఫ్లెచర్ 1982లో భారత్‌తో ఆడిన టెస్టులో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేశాడు. అది డ్రా అయింది.
ఇండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్‌దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (WK), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా.