కాగా బంగ్లా జట్టు తరఫున ఆడుతున్న ఒక యంగ్ బౌలర్ ఏ విధంగా టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ను దెబ్బ కొట్టాడు. హసన్ మహమ్మద్ నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు అతని దాటికి పది ఓవర్ల లోపే ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టారు. ఆరో ఓవర్ లో తొలి బంతికి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో హాసన్ మహమ్మద్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ ను పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ చేశాడు. ఇక అటు వెంటనే వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీని సైతం ఆరు పరుగుల వద్ద వికెట్ తీసుకున్నాడు.
ఇలా హాసన్ మహమ్మద్ తన బంతులతో నిప్పులు చెరగడంతో భారత్ ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇలా అద్భుతమైన ప్రదర్శన చేసి భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్లు తీసుకున్న యంగ్ బౌలర్ హసన్ మహమ్మద్ చరిత్ర సృష్టించాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ముగ్గురు బ్యాటర్లు లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలి ఇన్నింగ్స్ లో 10 ఓవర్లలోపు పెవిలియన్కు చేర్చిన ఆటగాడిగా.. హాసన్ మహమ్మద్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక బౌలర్ చనక వెల్గదర 2009లో సాధించాడు. ఆ టైంలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ను శ్రీలంక బౌలర్ చనుక 10 ఓవర్ల లోపు ప్రీవిలియన్ చేర్చి రికార్డు సృష్టించాడు.