టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతోనే అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు ఈ స్టార్ ప్లేయర్. మూడు ఫార్మాట్లలో కూడా సత్తా చాటి ఎవరు సాధించలేనన్ని రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ చేత రికార్డుల రారాజు అని పిలిపించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ క్రికెట్ విషయంలో ఎంత డెడికేషన్ చూపిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 కొన్ని కొన్ని సార్లు విరాట్ కోహ్లీ డెడికేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే క్రికెట్ పట్ల నిబద్ధత మాత్రమే కాదు క్రికెట్ రూల్స్ పట్ల ఎంతో అవగాహన కూడా కలిగి ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే ఎప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అయితే క్రికెట్లో విరాట్ కోహ్లీ పొరపాటులు చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి విరాట్ కోహ్లీ ఇటీవలే ఒక పెద్ద పొరపాటే చేశాడు. నాట్ అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ వికెట్ ఇచ్చేసాడు  ఈ విషయం తెలిసి ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే తొలి టెస్ట్ లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్ పై పూర్తి ఆదిపత్యం చాలా ఇస్తుంది అని చెప్పాలి. అయితే మొదటి ఇన్నింగ్స్ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయిన విరాట్ కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం జోరు చూపించాడు  అయితే ఇలా జోరు మీద ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ స్వీయ తప్పిదంతో పెవీలియన్ చేరాడు. హసన్ వేసిన బంతి ఆయన బ్యాట్కు తగులుతూ ప్యాడ్ ని తాకింది  అంపైర్ ఎల్ బి డబ్ల్యూ గా అవుట్ ఇచ్చాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న గిల్ తో మాట్లాడి కోహ్లీ వెనతిరిగాడు. కానీ ఆ తర్వాత రిప్లై లో చూస్తే బాల్ ఆయన బ్యాట్ కి తాకినట్లు తేలింది. అంటే అది నాటౌట్. కానీ కోహ్లీ పొరపాటు చేసి అవుట్ అని పెవిలియన్ వెళ్ళిపోయాడు. ఇది చూసి రోహిత్ శర్మ డగ్ అవుట్ నుంచి అసహనం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: